Samantha – Naga Chaitanya Divorce | టాలీవుడ్ నటి సమంతతో విడాకుల అనంతరం తొలిసారి ఈ విషయంపై స్పందిచాడు నటుడు అక్కినేని నాగచైతన్య. తండేల్ సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు చైతూ.
ఇందులో మాట్లాడుతూ.. తన పర్సనల్ లైఫ్ గురించి సమంతతో విడాకుల గురించి స్పందించాడు. విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే సమంత నేను విడిపోవాలి అనుకున్నాం అంటూ చైతూ తెలిపాడు. నేను కూడా విడాకుల తీసుకున్న ఫ్యామిలీ నుంచే వచ్చాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయాలి అన్నప్పుడు 1000 సార్లు ఆలోచించాను. ఆ తర్వాతే పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం కానీ.. ఇది ఇతరులకు ఎంటర్టైనమెంట్గా అయిపోయింది. నా మీదా ఎన్నో గాసిప్స్ వచ్చాయి. నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు. ఇకనైన ఇలాంటివి ఆపి మీ ప్యూచర్ చూసుకొండి అంటూ చైతూ తెలిపాడు.
ఏం మాయ చేసావే సినిమాతో సమంత – నాగచైతన్య పరిచయం అవ్వగా.. ఈ పరిచయం ప్రేమగా మారింది. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడిపోయింది. ప్రస్తుతం సమంత సింగిల్‌గానే ఉంటుండగా.. నాగ చైతన్య తెలుగు నటి శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో పడి గత ఏడాది ఆమెను పెళ్లి చేసుకున్నాడు.