Naga Chaitanya | బాలీవుడ్లో ఘన విజయాన్ని సాధించిన హారర్ థ్రిల్లర్ ‘భూల్ భులయ్యా 2’ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర హక్కులను ఇటీవల స్టూడియో గ్రీన్ సంస్థ దక్కించుకుంది. కథను నేటివిటీకి తగినట్లు మార్చి తమిళంలో ఈ సినిమాను నిర్మిస్తామని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ప్రకటించారు.
ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ అవుతుందని, అందులో నాగచైతన్య హీరోగా నటిస్తారని ప్రచారం మొదలైంది. దీనిపై స్పష్టత ఇచ్చారు నాగచైతన్య. ఈ సినిమాలో తాను నటించడం లేదని తెలిపారు. నాగచైతన్య ఇటీవల ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన దర్శకుడు శివ నిర్వాణతో ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు.