ఒక్కోసారి టైమ్ అలా కలిసి వస్తుంది అంతే. ఇప్పుడు అక్కినేని సోదరులకు అదే జరుగుతుంది. చాలా అంటే చాలా కాలం తర్వాత నాగ చైతన్య, అఖిల్ ఈ ఇద్దరు అక్కినేని హీరోలు విజయాలు అందుకుంటున్నారు. ఆరేళ్లుగా సరైన విజయం కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న అఖిల్ అక్కినేని.. ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే దాదాపు 14 కోట్ల షేర్ వసూలు చేసింది. మూడో రోజు కూడా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాంతో అఖిల్ విజయ వాంఛ తీరిపోయినట్లే అంటున్నారు అభిమానులు. అయ్యగారే నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై వాసు వర్మ, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించారు. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు తమ్ముడు అఖిల్అదరగొడుతుంటే.. కొన్ని రోజుల కింద అన్నయ్య నాగ చైతన్య అదరహో అనిపించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయం సాధించింది. భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 24న విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ మరోసారి వర్కవుట్ అయింది. దీంతో లవ్ స్టోరీ సినిమా తొలి రోజు ఏకంగా 9 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి మిగిలిన సినిమాలకు కావాల్సిన భరోసా ఇచ్చింది లవ్ స్టోరీ. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది లవ్ స్టోరీ. 32 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటివరకు 35 కోట్ల షేర్ వసూలు చేసింది. తద్వారా చైతూ మరో విజయం అందుకున్నాడు.
ఇప్పుడు తనయులు ఇద్దరూ ఒకేసారి అందుకున్న విజయం చూసి నాగార్జున పొంగిపోతున్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. కాకపోతే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత అక్కడ అద్భుతాలు చేసింది వైల్డ్ డాగ్. ఏదేమైనా చూస్తుంటే 2021 అక్కినేని అభిమానులకు బాగానే కలిసి వచ్చినట్లు అర్థమవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: సమంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?
Naga Chaitanya: ఇంటివాడు కాబోతున్న నాగచైతన్య .. పూర్తి వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
Samantha | అక్కినేని ఫ్యామిలీ కోసం సమంత అన్ని త్యాగాలు చేసిందా?