చిన్న విషయాన్ని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం ఫ్యాన్స్‌కి కామన్‌గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతి విషయాన్ని చాలా లోతుగా చూస్తుంటారు. ఆయన మెగా ఫ్యామిలీ వేడుకలకు హాజరు కాకపోయిన, ఏదైన ఈవెంట్లో చిరంజీవి ప్రస్తావన తేకపోయిన ఎన్నో పుకార్లు వస్తుంటాయి. ఈ పుకార్లు విని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతుంటారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు.
చిరంజీవిని మధ్యలో ఉంచి చుట్టూ మెగా హీరోలని ఉంచాడు. ఆ పిక్కి కామెంట్ పెట్టిన నాగబాబు.. ఈ పిక్‌లో ఉన్న మెగా హీరోలు అందరిలో కెల్లా మీరే యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్యా’’ అంటూ తన కామెంట్లో రాసారు.
అయితే నాగబాబు షేర్ చేసిన ఫొటోలో పవన్ కళ్యాణ్ పిక్ మిస్ కావడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా హీరోని ఎందుకు మిస్ చేశారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు .. నాగబాబు మనసులో తన తమ్ముడు కూడా ఇంకా యంగ్‌గా ఉన్నాడని భావిస్తున్నట్టున్నాడు అందుకే ఫొటో మిస్ చేశాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన మెగాస్టార్ మేకొవర్ లుక్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.