అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీపూజారెడ్డి కీలక పాత్రధారులుగా తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘పోచమ్మ’. రమేశ్ ఇందిర దర్శకత్వంలో శ్రుతినాయుడు నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 17(నేడు) నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ ప్రీమియర్ నిర్వహించి, తదనంతరం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
ప్రధాన పాత్రలు పోషించిన నటుడు అంబటి అర్జున్, నటి స్నేహాల్ కామత్, నటి శ్రీపూజ ఈ సిరీస్‌లో భాగం అయినందుకు ఆనందం వెలిబుచ్చారు. పోచమ్మతల్లి దయవల్లే ఈ సిరీస్ ఇంతబాగా వచ్చిందని, కథే ఈ సిరీస్‌కి ప్రధాన బలమని, అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉంటుందని ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ కవిత అన్నారు.