Ustad Rashid Khan | శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ ఇక లేరు..!
Ustad Rashid Khan | ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55) ఇక లేరు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గత డిసెంబర్ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా ఆసుపత్రికి తరలించారు. గత కొద్దిరరోజులుగా ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
Ustad Rashid Khan | ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55) ఇక లేరు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గత డిసెంబర్ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా ఆసుపత్రికి తరలించారు. గత కొద్దిరరోజులుగా ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇంతకు ముందు ఆయన ముంబయిలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోల్‌కతాకు వచ్చారు.
ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జన్మించారు. తాత ఉస్తాద్ నిసార్ హుస్సేన్ ఖాన్ వద్ద శిక్షణ తీసుకున్నారు. తొలిసారిగా ఆయన 11 సంవత్సరాల వయసులో రంగస్థల ప్రదర్శన న్విహించారు. ఆ తర్వాత సినిమాల్లోనూ ఆయన పాటలు పాడారు. ‘జబ్ వి మెట్’లో ఆయన ‘ఆవోగే జబ్ తుమ్ సాజ్నా’ అనే పాట బాగా పాపులర్ య్యింది. ఆయన ఉస్తాద్ అమీర్ ఖాన్, పండిట్ భీంసేన్ జోషి సంగీతానికి ప్రభావితుడయ్యారు. సినిమాల్లో ఆయన పాడిన పాటల్లో ‘తెరే బినా మోహే చైన్’ సూపర్‌హిట్ పాటను ఆలపించారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హిట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రంలోనూ ‘అల్లా హాయ్ రెహెమ్’ పాటపడారు. అలాగే ‘రాజ్-3’, ‘కాదంబరి’, షాదీ మే జరూర్ ఆనా’, ‘మంటో’ తదితర చిత్రాల్లోనూ గాత్రంతో అలరించారు. అలాగే బెంగాలీ పాటలను సైతం స్వరపరిచారు. దశాబ్దాల పాటు తనగాత్రంతో సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన ఉస్తాద్ రషీద్ ఖాన్ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషన్ అదుకున్నారు. రషీద్ ఖాన్ మృతికి పలువురు సంగీత అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

