Home
Cinema
Music Director Ram Miriyala Has Reached The Youth With Trendy Songs And Distinctive Voice
ఆయ్ మ్యూజిక్ కొత్తగా ఉంటుంది
ట్రెండీ పాటలతో, విలక్షణ గాత్రంతో యువతరానికి బాగా చేరువయ్యాడు సంగీత దర్శకుడు రామ్ మిరియాల. ప్రస్తుతం ఆయన ‘ఆయ్' చిత్రానికి స్వరాలను సమకూర్చుతున్నారు.
ట్రెండీ పాటలతో, విలక్షణ గాత్రంతో యువతరానికి బాగా చేరువయ్యాడు సంగీత దర్శకుడు రామ్ మిరియాల. ప్రస్తుతం ఆయన ‘ఆయ్’ చిత్రానికి స్వరాలను సమకూర్చుతున్నారు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా రామ్ మిరియాల చిత్ర విశేషాలను పంచుకున్నారు.
- నిర్మాత బన్నీ వాసు ఈ సినిమా మ్యూజిక్ కోసం నన్ను సంప్రదించినప్పుడు.. నా శైలి మ్యూజిక్ వేరు, ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్స్కు నేను అంతగా సెట్ కాలేనేమో అనుకున్నా. అయితే కథ విన్నాక బాగా నచ్చింది. గోదావరి నేపథ్యంలో సాగే ఈ కథలో చక్కటి లవ్‌స్టోరీ, కడుపుబ్బా నవ్వించే హాస్యం ఉంటుంది. వేసవిలో అందరిని మెప్పించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది.
- ఈ సినిమాలో రెండు పాటలు చేశాను. ఇటీవల విడుదలైన ‘సూఫియానా..’ అనే మెలోడి పాటకు మంచి స్పందన లభిస్తున్నది. పెళ్లి నేపథ్యంలో వచ్చే పాటను త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఈ రెండు పాటలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. చిత్ర దర్శకుడు, స్వరకర్తకు మధ్య చక్కటి అవగాహన, అభిరుచులు కుదిరినప్పుడే మంచి పాటలొస్తాయి. ‘సూఫియానా..’ పాట విషయంలో అదే జరిగింది. డైరెక్టర్ అందించిన సహకారంతో మంచి పాటలు అందించగలిగాను
- నేను ఇప్పటివరకు ఇలాంటి జోనర్ సినిమా చేయలేదు. అందుకే ‘ఆయ్’ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొత్త అనుభూతినిచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ నిత్య విద్యార్థిలా ప్రతి రోజు కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. నేను కూడా కొత్త సౌండింగ్ అందించాలనే తాపత్రయంతో పనిచేస్తున్నా. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ‘టిల్లు స్వేర్’ చిత్రాన్ని చేస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

