బంపర్ ఆఫర్ కొట్టేసిందా?
ప్రస్తుతం మృణాళ్ఠాకూర్ టైమ్ నడుస్తున్నది. సీతారామం, హాయ్ నాన్న విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నది ఈ అందాలభామ. ఈ మహారాష్ట్ర అందానికి మరో అద్భుతమైన అవకాశం వరించిందని ఫిల్మ్‌నగర్ టాక్.
ప్రస్తుతం మృణాళ్ఠాకూర్ టైమ్ నడుస్తున్నది. సీతారామం, హాయ్ నాన్న విజయాలతో మంచి దూకుడు మీద ఉన్నది ఈ అందాలభామ. ఈ మహారాష్ట్ర అందానికి మరో అద్భుతమైన అవకాశం వరించిందని ఫిల్మ్‌నగర్ టాక్. త్వరలో ప్రభాస్‌కి జోడీగా కనిపించనున్నదట మృణాళ్ఠాకూర్. వివరాల్లోకెళ్తే.. ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి త్వరలో ఓ పీరియాడికల్ డ్రామా తెరకెక్కించనున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా మృణాల్‌ని ఎంపిక చేశారన్న వార్త సాంఘిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అదే నిజమైతే మృణాళ్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ప్రస్తుతం మృణాళ్ ‘ఫ్యామిలీస్టార్’లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

