డిప్రెషన్లోకి వెళ్లిపోయా!
బుల్లితెర నటిగా కెరీర్‌ను మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ తెలుగు చిత్రం ‘సీతా రామం’తో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామకు భారీ సినిమాల్లో అవకాశాలొస్తున్నట్లు సమాచారం.
బుల్లితెర నటిగా కెరీర్‌ను మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ తెలుగు చిత్రం ‘సీతా రామం’తో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామకు భారీ సినిమాల్లో అవకాశాలొస్తున్నట్లు సమాచారం. అయితే తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవరోధాల్ని అధిగమించానని చెప్పింది మృణాల్ ఠాకూర్. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాటి రోజుల్ని గుర్తుచేసుకుందీ భామ. హిందీ చిత్రం ‘లవ్ సోనియా’ పాత్ర కోసం రెండు వారాల పాటు కోల్‌కతాలోని వేశ్యా గృహాల్లోకి వెళ్లి వారి జీవన విధానాన్ని పరిశీలించానని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ “లవ్ సోనియా’ చిత్రాన్ని మానవ అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కించారు. ఆ సినిమాలో అక్రమంగా వేశ్య గృహాల్లోకి చేర్చబడిన చెల్లిని రక్షించుకునే అక్క పాత్రను పోషించాను. నా పాత్రలో సహజత్వం కోసం రెండు వారాల పాటు కోల్‌కతాలోని వేశ్యా వాటికల్లో తిరిగి చాలా విషయాలు తెలుసుకున్నా. వారి దుర్భర జీవితం చూసి హృదయం ముక్కలైపోయింది. ఓ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా. ఎవరికీ అలాంటి కష్టాలు రావొద్దని భగవంతుల్ని కోరుకున్నా. షూటింగ్ టైమ్‌లో అక్కడి వాళ్ల జీవితం గుర్తొచ్చి ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాను. చిత్ర బృందం ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ పాత్రను సహజ ంగా పోషించగలిగాను’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

