Mrinal Thakur | ఆ సినిమాలో పాత్ర కోసం గొడవపడ్డా.. : మృణాల్ ఠాకూర్
‘సీతారామం’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ హిందీలో సైతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఆమె నటించిన ‘పూజా మేరీ జాన్' అనే హిందీ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది.
Mrinal Thakur | ‘సీతారామం’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ హిందీలో సైతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఆమె నటించిన ‘పూజా మేరీ జాన్’ అనే హిందీ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది. దాదాపు రెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తన కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమని, ఈ సినిమాలోని పాత్ర కోసం నిర్మాతలతో గొడవ కూడా పడ్డానని మృణాల్ ఠాకూర్ చెప్పింది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా రియల్లైఫ్కు దగ్గరి సంబంధం ఉన్న పాత్రను పోషించా. ఎప్పటి నుంచో ఈ తరహా పాత్ర కోసం చూస్తున్నా. ఈ సినిమా కోసం మరొక నాయికను ఎంచుకుంటున్నారని తెలిసి నిర్మాతలతో గొడవకు దిగాను. ఆ క్యారెక్టర్ నేనే చేస్తానని ప్రాధేయపడ్డాను. ఆ పాత్ర నన్ను అంతలా ఇంప్రెస్ చేసింది. నా కెరీర్లో గొప్ప పాత్రగా మిగిలిపోతుంది’ అని చెప్పింది. ‘పూజా మేరీ జాన్’ చిత్రానికి విపాషా అరవింద్ దర్శకత్వం వహించారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

