Mr Deyyam | విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో ‘మిస్టర్ దెయ్యం’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
Mr Deyyam | శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్ మీద వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్ మీద వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి సంజన అన్నే దర్శకత్వం వహించనున్నారు. శుక్రవారం నాడు నిర్వహించిన పూజా కార్యక్రమానికి మంచు మనోజ్, అలీ, విజయ్ కనకమేడల, ఆర్పీ పట్నాయక్, పట్నం మహేందర్ రెడ్డి, రమేష్ పుప్పాల, సమీర్, చింటు, వీర శంకర్, రాజా వన్నెం రెడ్డి, విఎన్ ఆదిత్య, జ్యోత్స, లేబర్ కమిషనర్ గంగాధర్, కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేయగా.. వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం దర్శకురాలు సంజన అన్నే మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రయాణంలో ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటున్న మీడియా, ఈ నూతన చిత్రానికి కూడా అందించాలని కోరారు.
నటుడు ఖయ్యూమ్ మాట్లాడుతూ, టైటిల్ చాలా బాగుంది అని, ఈ చిత్రంలో తాను మంచి పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. విజయ్ శంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా ఉండటమే కాకుండా, ఎవరూ చూడనటువంటి సరికొత్త హారర్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. సిరి చౌదరి మాట్లాడుతూ, నవంబర్ మొదటి వారంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. పింగ్ పాంగ్ సూర్య మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే వ్యవహరిస్తుండగా, కెమెరామెన్‌గా బాబు కె. రావు, సంగీత దర్శకుడిగా రాజేష్, కో-ప్రొడ్యూసర్‌గా అన్నే ధన కోటేశ్వర రావు, పీఆర్వోగా సాయి సతీష్ పని చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
Kondagattu | కొండగట్టులో ఆర్జిత సేవలు , వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
Response | నమస్తే తెలంగాణ కథనానికి స్పందన.. కాల్వకు మరమ్మతులు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

