సంపూర్ణేష్‌బాబు, అద్వితిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బెగ్గర్’. వడ్ల జనార్థన్ దర్శకుడు. గురురాజ్, కార్తిక్ నిర్మాతలు. ఇటీవలే మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ ఎంటర్టైనర్ ఇది. సంపూర్ణేష్‌బాబు తనదైన హాస్యంతో నవ్వుల్ని పంచుతాడు’ అన్నారు. ‘మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 25 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. సంపూర్ణేష్‌బాబు గత చిత్రాలకు భిన్నమైన కామెడీతో ఆకట్టుకుంటుంది’ అని నిర్మాతలు తెలిపారు.