OTT Releases | అసలే ఎండాకాలం.. అందులోనా ఏప్రిల్ వచ్చేసింది. ఈ మండుటెండలో మూవీ లవర్స్‌కు బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే వినోదాన్ని అందించేందుకు పలు సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లు రెడీ అవుతున్నాయి. థియేటర్లలో సినిమాలు మిస్సయిన వాళ్ల కోసం ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఓటీటీలో ఈ వారం వినోదాన్నిఅందించేందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్క్తేస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ :
పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. భారీ అంచనాల మధ్య మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానులు, మూవీ లవర్స్‌కు నిరాశనే మిగిల్చింది. ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునే రెడీ అవుతోంది. తాజా టాక్ ప్రకారం ఏప్రిల్ 16న ఓటీటీలో ప్రీమియర్ కానుంది.. ఇంతకీ ఏ ప్లాట్‌ఫాం అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో సందడి చేయనుంది.
యూత్ :
కెన్ కరుణాస్ డైరెక్షన్లో లీడ్ రోల్లో నటించిన ఎంటర్టైనర్ యూత్. అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్టాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 16నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మట్కాకింగ్ :
నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు విజయ్ వర్మ. ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటించిన చిత్రం మట్కా కింగ్. నాగరాజ్ పొపట్రావ్ మంజులే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో ఏప్రిల్ 17న ప్రీమియర్ కానుంది. ఈ సిరీస్‌లో కృతిక కామ్ర, సాయి తమ్హంకర్, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు.
చిట్టి తల్లి :
కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శరణ్య తేజు డైరెక్ట్ చేసిన తెలుగు షార్ట్ ఫిల్మ్ చిట్టి తల్లి. రాజీవ్ కనకాల, మోనిక, అనిరుధ్ నటించిన షార్ట్ ఫిల్మ్ ఈటీవీ విన్లో ఏప్రిల్ 12 నుంచి ప్రీమియర్ కానుంది.
మా ఇంటి కథ :
రోహిత్ సత్యన్, అనూష నూతుల, ఉదయ్ కిరణ్, రిషి కార్తికేయ కీలక పాత్రలో నటించిన తెలుగు సిరీస్ మా ఇంటి కథ. ఉదయ్ కిరణ్, రిషి కార్తికేయ ఇతర కీ రోల్స్ పోషించారు. శ్రవణ్ దాములూరి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఏప్రిల్ 17న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది.
Toaster :
బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు, సన్యా మల్హోత్రా నటించిన హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ Toaster. వివేక్ దాస్ చౌదరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 15 నుంచి ప్రీమియర్ కానుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉండనుంది.
పోచమ్మ :
రమేశ్ చంద్ర డైరెక్ట్ చేసిన మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ. అంబటి అర్జున్, స్నేహల్ కామత్, శ్రీ పూజ నటించిన ఈ సిరీస్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఏప్రిల్ 17న ప్రీమియర్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
దో దివానే సెహర్ మే..
సిద్దాంత్ చతుర్వేది, మృణాళ్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కి చిత్రం Do Deewane Seher Mein. థియేటర్లలో నిరాశ పరిచిన ఈ చిత్రం ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకోనుంది. ఏప్రిల్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.
Assi:
తాప్సీ పన్ను నటించిన కోర్ట్ రూం డ్రామా అస్సీ. అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ జీ 5లో ఏప్రిల్ 17న ప్రీమియర్ కానుంది. ఇండియాలో జరుగుతున్న లైంగిక వేధింపుల కేసుల నేపథ్యంలో సాగే ఈ సినిమాపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
UK Migrant Rules | పదేళ్ల ఆవాసం తర్వాతే యూకేలో శాశ్వత నివాసం.. నిబంధనలు కఠినతరం..!