మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఓటీటీ రిలీజ్ పై అల్లు అరవింద్ క్లారిటీ

most eligible bachelor ott release | ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తుంది. మహా అయితే మరో 10 రోజులు.. ఎలా చూసుకున్నా కూడా 40 రోజుల్లో కచ్చితంగా ఒరిజినల్ ప్రింట్ వచ్చేస్తుంది. నిర్మాతలు కూడా అలాగే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చాలామంది ఫ్యామిలీలు ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుందామని రిలాక్స్ అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఓటీటీ రిలీజ్ పై నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా థాంక్స్ మీట్ వైజాగ్ లో జరిగింది. అందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బొమ్మరిల్లు సినిమా తీసి బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. ఇప్పుడు బ్యాచ్‌లర్ భాస్కర్ అయిపోతాడేమో తెలియదు మరి. కాకపోతే ఈ సినిమాతో ఎంత మంది కాపురాలకు సమస్యలు తెస్తాడో అనిపిస్తుంది. సినిమాల్లో సాధారణంగా మెసేజ్ ఎక్కదు.. కానీ ఈ సినిమాలో బ్యాచ్‌లర్ అనే టైటిల్ పెట్టి పెళ్లి కాకుండానే కాపురం చూపిస్తారు. అందుకే ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే.. భార్యా భర్తలు కావాలంటే ఏయే అంశాలు కావాలో ఈ సినిమాలో చూపించారు. భార్యాభర్తలు చూస్తే కచ్చితంగా మొహాలు చూసుకుంటారు. మహిళలు మీ భర్తలను సినిమాకు తీసుకెళ్లండి. మెసేజ్ చూసి ఆనందిస్తారు.. అది మా గ్యారెంటీ’ అని అన్నారు. అదే విధంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఓటీటీ రిలీజ్ పై కూడా అల్లు అరవింద్ స్పందించాడు. చాలా సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. కానీ ఈ సినిమా కొన్ని నెలల వరకు ఓటీటీలో రావడం లేదు. థియేటర్స్‌కు వెళ్లి చూడాల్సిందే. త్వరలోనే వచ్చేస్తుంది ఓటీటీలో ఈ సినిమా వస్తుందని నేను నిన్న చూశాను.. కానీ అది నిజం కాదు. చాలా కాలం తర్వాతే ఇది ఓటీటీలో వస్తుంది..’ అని తెలిపారు. అంటే ఈ సినిమాను ఇప్పట్లో OTTలో విడుదల చేయడం కష్టమే. మరి ఇది నిజమా లేదంటే ఏదైనా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కుమ్మేస్తున్నాడుగా.. అఖిల్ ఫస్ట్ హిట్ కన్ఫర్మ్..
Samantha: సమంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?
Naga Chaitanya: ఇంటివాడు కాబోతున్న నాగచైతన్య .. పూర్తి వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
Samantha | అక్కినేని ఫ్యామిలీ కోసం సమంత అన్ని త్యాగాలు చేసిందా?
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

