మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కుమ్మేస్తున్నాడుగా.. అఖిల్ ఫస్ట్ హిట్ కన్ఫర్మ్..

most eligible bachelor two days collections | అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. దాంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో వాసు వర్మ, బన్నీ వాస్ సంయుక్తంగా సినిమాను నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నాడు. ఈ సినిమాతో మొదటి హిట్ కొట్టేస్తున్నాడు అఖిల్. ఆరేళ్లుగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్ని చోట్లా కుమ్మేస్తుంది. రెండో రోజు కూడా 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బొమ్మరిల్లు తర్వాత ఆ స్థాయి విజయం లేని భాస్కర్ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు కనిపించినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం కాసుల వర్షం బాగానే కురిసింది. తొలి 2 రోజుల్లోనే ఈ చిత్రం 70 శాతం పెట్టుబడి వెనక్కి తెచ్చేసింది. ఇదే దూకుడు సాగితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్‌కు మొదటి విజయంగా నిలవడం ఖాయం. ఈ సినిమా 2 రోజుల ఏరియా వైజ్ వసూళ్లు చూద్దాం..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

నైజాం: 4.13 కోట్లు
సీడెడ్: 2.16 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.15 కోట్లు
ఈస్ట్: 0.71 కోట్లు
వెస్ట్: 0.64 కోట్లు
గుంటూరు: 0.75 కోట్లు
కృష్ణా: 0.58 కోట్లు
నెల్లూరు: 0.45 కోట్లు
ఏపీ + తెలంగాణ: 10.57 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.11 కోట్లు
వరల్డ్ వైడ్ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 13.67 కోట్లు షేర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకు రూ. 20.91 కోట్ల బిజినెస్ జరిగింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.67 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మూడో రోజు కూడా సెలవు కావడంతో చాలా చోట్ల హౌజ్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. ఆదివారం కూడా కచ్చితంగా 5 కోట్లు షేర్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే మూడు రోజుల్లోనే ఈ చిత్రం 19 కోట్ల వరకు షేర్ వసూలు చేయడం ఖాయం. మరో 2 కోట్లు వసూలు చేస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హిట్ లిస్టులోకి వెళ్లిపోతుందన్నమాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood | దసరా విన్నర్ ఎవరు.. మూడు సినిమాల్లో ఏది బెటర్..
Pawan Kalyan: పవన్ వీడియో షేర్ చేసిన మంచు విష్ణు.. ఏ ప్రశ్న వేసాడో తెలుసా?
Love Story: లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్కి టైం ఫిక్స్.. ట్రైలర్‌తో కన్ఫాం చేసిన మేకర్స్
Prabhas: ప్రభాస్‌కి విలన్‌గా స్టార్ హీరోయిన్..!
తనను అసహ్యించుకునే వారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన రష్మిక
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

