Moosewala song | సిద్ధూ మూసేవాలా రెండో పాట ‘వార్’ విడుదల.. తొలి పాటపై కేంద్రం కన్నెర్ర
Moosewala song | హత్య అనంతరం సిద్ధూ మూసేవాలా పాడిన రెండో పాట ఇవాళ రిలీజైంది. ఆయన యూట్యూబ్ చానల్‌తోపాటు ఇన్స్టాగ్రాం హ్యాండిల్లో పాటను విడుదల చేశారు. ఆయన పాడిన తొలిపాట ఎస్‌వైఎల్ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం నిషేధం విధించింది.
Moosewala song | పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా రెండో పాట ఇవాళ గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ సందర్భంగా విడుదలైంది. మూసేవాలా యూట్యూబ్ ఛానెల్లో మంగళవారం ఉదయం 10:02 గంటలకు ‘వార్’ పాటను రిలీజ్ చేశారు. పాట లింక్ విడుదలైన అతి తక్కువ సమయంలో 1.96 లక్షల లైక్స్, 1.69 వ్యూస్ సంపాదించింది. విడుదలైన 20 నిమిషాల్లోనే 10.94 లక్షల మంది ఈ పాటను వినడం విశేషం. ఈ పాటను మూసేవాలా అధికారిక ఇన్స్టాగ్రాం హ్యాండిల్లో కూడా షేర్ చేశారు.
సిద్ధూ మూసేవాలా హత్యానంతరం విడుదలైన మొదటి పాట ‘ఎస్ఐఎల్- సట్లజ్ యమునా లింక్ కెనాల్’.. పంజాబీ సంగీత రికార్డులను బద్దలు కొట్టింది. ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ పాటను.. కొన్ని చట్టపరమైన సమస్యల కారణంగా భారత ప్రభుత్వం వీడియో స్ట్రీమింగ్ సైట్ నుంచి తొలగించింది.
తక్కువ సమయంలో పేరు, ప్రఖ్యాతులను సంపాదించుకున్న మూసేవాలా.. ‘లైసెన్స్’ సాంగ్‌తో 2016 లో పంజాబీ సంగీత ప్రపంచంలోకి అడుగిడారు. పాటలతో తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడని మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ప్రతి ఆర్నెళ్లకోసారి ఆయన పాటలను విడుదల చేస్తామని చెప్పారు. కాగా, ఆయన హత్య మిస్టరీ ఇప్పటికీ వీడకపోవడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

