Mohanlal | ఏనుగు దంతాల కేసులో కీలక మలుపు.. కేరళ హైకోర్టు ముందుకు మోహన్‌లాల్ ఐటీ డిక్లరేషన్ పత్రాలు..!
Mohanlal | మలయాళ సూపర్ స్టార్, పద్మభూషణ్ మోహన్‌లాల్ (Mohanlal) ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఏనుగు దంతాల (Elephant Tusks) అక్రమ నిల్వ కేసు కేరళ హైకోర్టు (Kerala High Court) లో సరికొత్త మలుపు తిరిగింది. గతంలో ఆయన ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ నివేదిక ఇప్పుడు న్యాయస్థానం ముందుకు వచ్చింది.
Mohanlal : మలయాళ సూపర్ స్టార్, పద్మభూషణ్ మోహన్‌లాల్ (Mohanlal) ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఏనుగు దంతాల (Elephant Tusks) అక్రమ నిల్వ కేసు కేరళ హైకోర్టు (Kerala High Court) లో సరికొత్త మలుపు తిరిగింది. గతంలో ఆయన ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ నివేదిక ఇప్పుడు న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఆ పత్రాల ప్రకారం మోహన్‌లాల్ వద్ద కేవలం నాలుగు మాత్రమే కాకుండా, మొత్తం 10 ఏనుగు దంతాలతోపాటు దంతాలతో చేసిన మరో 13 కళాఖండాలు (విగ్రహాలు) ఉన్నాయి. ఈ వివరాలను ఆయన స్వయంగా వెల్లడించారు.
2011 జూన్ నెలలో మోహన్‌లాల్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఆయన సొంత నివాసంలో నాలుగు ఏనుగు దంతాలు దొరికాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా ఇలాంటి నిషేధిత వస్తువులను దగ్గర ఉంచుకోవడం నేరం కావడంతో కేరళ అటవీ అధికారులు నాడు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం గత పదేళ్లుగా కోర్టు పరిధిలోనే నలుగుతోంది.
ఇదిలావుంటే మోహన్‌లాల్ ఎలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడలేదని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ప్రత్యేక ‘ఐవరీ అమ్నెస్టీ’ పథకం కింద ఈ సమాచారాన్ని ముందే డిక్లేర్ చేశామని కోర్టుకు వివరించారు. అయితే ఐటీ శాఖకు వివరాలు అందజేసినప్పటికీ అటవీ చట్టాల ప్రకారం ఈ దంతాలను కలిగి ఉండటానికి అవసరమైన అధికారిక యాజమాన్య ధ్రువీకరణ పత్రాన్ని మోహన్‌లాల్ సకాలంలో పొందారా..? లేదా..? అనే లీగల్ పాయింట్‌పైనే ప్రస్తుతం హైకోర్టులో ప్రధానంగా విచారణ సాగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

