M. M. Keeravani | ఒక పాట హిట్టా ? ఫట్టా ? ఎట్లా తెలుస్తది.. వైరల్‌గా కీరవాణి కామెంట్స్
M. M. Keeravani | ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని తెలుగు పాటను విశ్వ వేదికపై సగర్వంగా నిలబెట్టారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. ప్రస్తుతం ఆయన నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రానికి సంగీతాన్నందించారు.
M. M. Keeravani | ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని తెలుగు పాటను విశ్వ వేదికపై సగర్వంగా నిలబెట్టారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. ప్రస్తుతం ఆయన నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రానికి సంగీతాన్నందించారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సుస్వరాల బాణీ ..ఎం.ఎం.కీరవాణి సోమవారం పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
- కెరీర్ ఆరంభం నుంచే నేను సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా. ఆస్కార్ విజేతగా నా మ్యూజిక్ ప్రభావం ‘నా సామిరంగ’ సక్సెస్‌పై ఉంటుందా అని అడుగుతున్నారు. నా దృష్టిలో ఆస్కార్ పురస్కారం సినిమా సక్సెస్‌ను నిర్ధేశించలేదు.
- సినిమా సక్సెస్ కావాలంటే..డైరెక్టర్ బాగా తీయాలి, నేను కూడా మ్యూజిక్‌పరంగా బాగా వర్క్ చేయాలి..మేము చేసిన పని జనాలకు కనెక్ట్ కావాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఇక నాగార్జునతో పనిచేయడం నాకు అలవాటైన విద్య. మా కాంబినేషన్లో అన్నీ సక్సెస్‌లే ఉన్నాయి. ‘నా సామిరంగ’ కూడా అదే తరహాలో విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నా.
- నాగార్జునతో ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అల్లరి అల్లుడు మొదలుకొని అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాలను చేశాను. ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’ గ్రామీణ నేపథ్య కథ. ‘నా సామిరంగ’ కూడా అలాంటి సినిమానే. ఈ రెండు చిత్రాల్లో చక్కటి వినోదం ఉంటుంది. అందుకే ఆ సినిమా స్థాయిలోనే ‘నా సామిరంగ’ విజయం తథ్యమని నమ్ముతున్నా.
- ‘నా సామిరంగ’ టైటిల్ నాగార్జునకు చక్కగా కుదిరింది. తెలుగు సంప్రదాయం, సంస్కృతి, మనవైన ఆచారాలు, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతం కూడా చాలా కొత్త ఫీల్‌తో ఉంటుంది.
- దర్శకుడు విజయ్ బిన్ని కొత్తవాడైనా సినిమా మేకింగ్‌తో పాటు మ్యూజిక్ విషయంలో మంచి అవగాహన ఉంది. తను కొరియోగ్రాఫర్ అయినప్పటికీ డ్యాన్స్ కోణంలో ఆలోచించకుండా మెలోడీ ప్రధానంగా మూడు పాటలను చేయించాడు. ఎంతో అనుభవజ్ఞుడిలా చక్కటి పరిపక్వతతో సినిమాను తెరకెక్కించాడు.
- ఇప్పుడు ఓ పాట ఎంతలా వైరల్ అయితే అదే విజయానికి కొలమానం అనే భావన ఉంది. వాస్తవానికి పాట వైరల్ కావడం మన చేతిలో లేదు. ఒకప్పుడు పెళ్లి బ్యాండ్‌లో ఒక పాటను పదే పదే ప్లే చేస్తే దాన్ని హిట్ పాట క్రింద లెక్కకట్టేవాళ్లు. ఇప్పుడు వ్యూస్‌ను బట్టి నిర్ణయిస్తున్నారు. నా వరకు నిజాయితీగా పనిచేయడం గురించి మాత్రమే ఆలోచిస్తా. పాట వైరల్ కావడం అనేది మన
చేతిలో ఉండదు. - ఇటీవలకాలంలో ‘యానిమల్’ మ్యూజిక్ బాగుంది. అలాగే ‘జైలర్’ నేపథ్య సంగీతం బాగా నచ్చింది. ఆ ఇద్దరు సంగీత దర్శకులను అభినందిస్తూ మెసేజ్ కూడా పెట్టాను. రాజమౌళి-మహేష్‌బాబు సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్ ఇంకా మొదలుకాలేదు. ఇక ‘హరిహరవీరమల్లు’
సినిమాకు మూడు పాటలు రికార్డ్ చేశాం. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్
మొదలయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

