Anushka | నవీన్ పొలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్‌బాబు.పి దర్శకుడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని ‘లేడీ లక్’ అనే పాటను ఇటీవల విడుదల చేశారు. రధన్ సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు. ఇందులో అనుష్క తన అందచందాలతో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించనున్నారు. ఆద్యంతం వినోద ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, రచన-దర్శకత్వం: మహేష్ బాబు.పి.