Chiranjeevi | మీటర్ కిరణ్ అబ్బవరం కెరీర్లోనే ఖరీదైన సినిమా.. నిర్మాత చిరంజీవి చిట్‌చాట్
హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ మీటర్ (Meter). మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు తెరకెక్కిస్తున్నారు. మీటర్ ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నసందర్భంగా నిర్మాత చిరంజీవి (Chiranjeevi ) మీడియాతో చిట్ చాట్ చేశారు.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ మీటర్ (Meter). కోలీవుడ్ భామ అతుల్య రవి (Athulyaa Ravi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు తెరకెక్కిస్తున్నారు. మీటర్ ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిరంజీవి (Chiranjeevi ) మీడియాతో చిట్ చాట్ చేశారు. మీటర్ సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే..
మీటర్ గురించి ఏం చెప్తారు..?
మీటర్ టీజర్, ట్రైలర్‌కు వస్తున్న స్పందన మీరే చూశారు. సినిమా అవుట్‌పుట్ బాగా రావడం పట్ల సంతోషంగా ఉంది. మీటర్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఇది నా మొట్టమొదటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. కథ చాలా బలంగా ఉంటుంది. రమేశ్ కడూరి అద్బుతమైన కథతో రావడంతో.. ఈ సినిమాను నిర్మించాలని ఫిక్సయ్యా..
మీటర్‌ను ఇతరుల సినిమాలతో పోల్చడంపై మీ కామెంట్..?
మా దర్శకుడు అనిల్ రావిపూడి, బాబీ నుంచి చాలా స్పూర్తి పొందాడు. అందువల్ల కొన్ని ప్రమోషనల్ రషెస్‌లో ఆ డైరెక్టర్ల ఇంప్రెషన్స్ కనిపిస్తాయి.
కిరణ్ అబ్బవరం గురించి ..?
కిరణ్ అబ్బవరం ఎలాంటి పాత్రనైనా సులభంగా చేయగలడు. మీటర్లో ఎనర్జిటిక్, డైనమిక్ హీరో పాత్రలో కనిపిస్తాడు. హీరోగా దర్శకుడు ఆశించిన అవుట్‌పుట్‌ను ఇచ్చాడు. కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యంత ఖరీదైన సినిమా ఇది.
కిరణ్ అబ్బవరం మీ మొదటి ఛాయిసా..?
డైరెక్టర్ రమేశ్ కడూరి మొదట ఈ సినిమాను పెద్ద యాక్టర్లతో చేయాలనుకున్నాడు. కొందరు స్టార్లకు కథ కూడా వినిపించాడు. అయితే వారి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ కథను ఎస్ఆర్ కళ్యాణమండపం తర్వాత కిరణ్ అబ్బవరానికి వినిపించాడు. అతడు కథను ఓకే చేయడంతో సినిమా మొదలైంది.
మీటర్ బడ్జెట్‌పై మీ కామెంట్..?
సినిమా బడ్జెట్ మేమనుకున్న దానికంటే ఎక్కువైంది. మీటర్లో ఛమ్మక్ పోరి సాంగ్‌ను కలర్ఫుల్గా చేయాలని ఫిక్సవడంతో బాగానే ఖర్చు చేశాం. బడ్జెట్ ఎక్కువైనప్పటికీ సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సినిమా ఎలా ఉంటుందో బిగ్ స్క్రీన్‌పై మీరే చూస్తారు.
మీ కొత్త సినిమాల గురించి..
మత్తు వదలరా ఫేం రితేశ్ రానా దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా ఉంటుంది. మరో డెబ్యూ డైరెక్టర్‌తో కొత్త సినిమా త్వరలోనే ప్రకటించబోతున్నాం. సరైన సమయంలో ఆ సినిమాల అప్డేట్స్ ఇస్తా.
Read Also
Athulyaa Ravi | మెగాస్టార్ చిరంజీవితో అతుల్య రవి.. ట్రెండింగ్‌లో ఫొటోలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

