అవన్నీ వదంతులే..!
ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్నది మలయాళీ సోయగం కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో మంచి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నది.
ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్నది మలయాళీ సోయగం కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో మంచి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నది. ఇటీవల ఈ భామ పెళ్లి వార్తలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. కీర్తి సురేష్ తన చిన్ననాటి మిత్రుడితో గత పదేళ్లుగా ప్రేమలో ఉందని, అతనికి కేరళలో పలు వ్యాపారాలున్నాయని వార్తలొచ్చాయి. ఈ ఏడాదిలోనే తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి కీర్తి సురేష్ పెళ్లిపీటలెక్కనుందని ప్రచారం జరిగింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ స్పందించింది. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, సినిమాల్లో మరి కొన్నేళ్లు కొనసాగాలన్నది తన లక్ష్యమని స్పష్టం చేసింది. పెళ్లి విషయంలో వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, ఒకవేళ పెళ్లి కుదిరితే తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘దసరా’ చిత్రంతో పాటు చిరంజీవి ‘భోళా శంకర్’లో సినిమాలో ఆయన చెల్లెలి పాత్రలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

