జీవితాంతం గుర్తుపెట్టుకుంటా!

కథాంశాల ఎంపిక పరంగా సీనియర్ కథానాయికల ప్రాధామ్యాలు మారుతున్నాయి. కేవలం ప్రధాన స్రవంతి చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా అభినయపరంగా తమ ప్రతిభను చాటుకోవడానికి మహిళా ప్రధాన ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తున్నారు. దక్షిణాది మొదలుకొని బాలీవుడ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితమైన పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తొలిసారి ‘ఉమ’ అనే పూర్తిస్థాయి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా తనకు జీవితకాలపు అనుభవాన్ని మిగిల్చిందని, షూటింగ్ తాలూకు హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటపడలేక పోతున్నానని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ‘షూటింగ్ పూర్తయ్యాక కూడా మనల్ని వెంటాడే పాత్రలు కొన్నే ఉంటాయి. అందులో ‘ఉమ’ ఒకటి. ఆ క్యారెక్టర్ ప్రభావం నుంచి బయటపడటం సాధ్యం కాలేదు. నా హృదయాన్ని స్పృశించిన అద్భుతమైన కథ ఇది. జీవితాంతం గుర్తుపెట్టుకుంటా’ అని కాజల్ అగర్వాల్ చెప్పింది. రాజకుటుంబానికి చెందిన పెళ్లి వేడుకలోకి ఓ అపరిచితురాలైన అమ్మాయి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఆ కుటుంబంలో, అమ్మాయి జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంగా ‘ఉమ’ చిత్రాన్ని రూపొందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

