పంజాబీ బ్యూటీ మెహ్రీన్.. నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెహ్రీన్‌కి వరుస ఆఫర్స్ వచ్చాయి. అందులో మహానుభావుడు చిత్రం ఒకటి. మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో శర్వానంద్‌కి అతిశుభ్రత అనే ఓసీడీ ఉంటుంది. ఇలా నిజజీవితంలో తనకు ఉందని చెప్పుకొచ్చింది హీరోయిన్ మెహ్రీన్.
రీసెంట్గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకులని పలకరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు అతిశుభ్రత ఎక్కువ అనే విషయాన్ని చెప్పింది. మహానుభావుడు సినిమాలో హీరోకు అతిశుభ్రత అనే ఓసీడీ ఉంటుంది. కానీ నాకు రియల్ లైఫ్ లో ఉంది. కరోనా వచ్చిన తర్వాత అంతా శానిటైజర్లు వాడుతున్నారు. కానీ నాకు చాలా ఏళ్లుగా శానిటైజర్ అలవాటు. అప్పట్లో నా బ్యాగ్ లో 2-3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవి. ఇప్పుడు 6-7 ఉంటున్నాయి.
నా స్టాఫ్ చేతులు కడుక్కోకపోయినా, శానిటైజర్ రాసుకోకపోయినా వారితో మాట్లాడను. మేకప్ మేన్ అయితే చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాతే నా ఫేస్ టచ్ చేయాలి. ఫస్ట్ నుంచి నేను ఇంతే అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. త్వరలో మెహ్రీన్ ఎఫ్ 3 చిత్రంతో పలకరించనుంది.