తెలుగులో తక్కువ చిత్రాల్లో నటించినా తనదైన అభినయంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది మేఘా ఆకాష్. తాజాగా ఈ భామ పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడితో ఆమె వివాహం జరగనుందని తెలిసింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే కుటుంబ పెద్దలను కలిసి పెళ్లికి అంగీకారం తీసుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయని తెలిసింది. అయితే పెళ్లి విషయంలో మేఘా ఆకాష్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.