Chiranjeevi | నీటి కొరతకు చెక్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో చూడండి..!
Chiranjeevi | కొంతకాలంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి కొరత ఏర్పడుతున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి కొరతను అధిగమించేందుకు ఏం చేయాలో తనవంతు ప్రయత్నంలా కొన్ని ఫొటోలతో సందేశాన్ని షేర్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).
Chiranjeevi | సినిమాలతో వినోదాన్ని అందించడమే కాదు.. సామాజిక సేవలో కూడా ఎప్పుడు ముందుండే హీరోల్లో టాప్లో ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). కొంతకాలంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి కొరత ఏర్పడుతున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి కొరతను అధిగమించేందుకు ఏం చేయాలో తనవంతు ప్రయత్నంలా కొన్ని ఫొటోలతో సందేశాన్ని షేర్ చేసుకున్నాడు చిరు.
నీరు అత్యంత విలువైన వస్తువు అని మనందరికీ తెలుసు. నీటి కొరత రోజువారీ జీవితాన్ని కష్టతరం చేస్తుంది. నేడు బెంగళూరులో నీటి కొరత ఏర్పడవచ్చు. రేపు ఇలా ఎక్కడైనా జరగవచ్చు. అందువల్ల నీటి సంరక్షణకు తోడ్పడే గుంతలు, బావులను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేందుకు ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా.
బెంగుళూరులోని నా ఫామ్ హౌస్ కోసం నీటి కొరతను అధిగమించేందుకు నేను చేసిన పనులను మీతో పంచుకుంటున్నా. ఉపరితల నీటి ప్రవాహాన్ని నిర్దేశించడానికి తగిన ఎత్తులో స్థలం అంతలా నిర్దేశిత పాయింట్ల వద్ద 20-36 అడుగుల లోతు రీఛార్జ్ బావులు (Recharge wells) ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బావిలో వడపోత వ్యవస్థ ఉంటుంది. వివిధ కంకరలతో వేసిన సిల్ట్ ట్రాప్ గుండా రాతి పరిమాణాలు, ఇసుక, పొరల మీదుగా నీరు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది.
రీఛార్జ్ వెల్ – రీఛార్జ్ పిట్తో పోలిస్తే ఎక్కువ నీటిని నిల్వ చేస్తుంది. ఇలా చేయడానికి నేను పెర్మాకల్చర్ సూత్రాలను అమలు చేసా. పెర్మాకల్చర్ పర్యావరణాన్ని పునరుజ్జీవింపజేసే వృత్తాకార సూత్రంపై పనిచేస్తుంది. పెర్మాకల్చర్ ప్రధాన ఫలితం నీటి డిమాండ్ తగ్గడం.నేల నుండి బాష్పీభవన నష్టాన్ని తగ్గించే తోటను ఉపయోగించి తగిన గ్రౌండ్ కవర్తోపాటు చనిపోయిన ఆకులు, చెక్క ముక్కలను ఉపయోగించి కప్పడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనం నీటిని సంరక్షించడమే కాదు.. వర్షపు నీటి సంరక్షణను మెరుగుపరచవచ్చు . పర్యావరణ అనుకూల గృహాలను నిర్మించవచ్చు. ఈ ఫొటోలను చూడండి.. అంటూ సుదీర్ఘ సందేశాన్ని అందరితో పంచుకున్నాడు.
ఫామ్హౌజ్లో ఇలా..
ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ… ಬಹಳ ಮುಖ್ಯ.
ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

