Varun Tej | టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్ (Varun Tej) , లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థ వేడుక ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుక నాగేంద్రబాబు నివాసంలో మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం, లావణ్య కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరుగనుంది. లావణ్య త్రిపాఠి సంప్రదాయ వస్త్రధారణలో కుటుంసభ్యులతో కలిసి కారులో ఎంగేజ్మెంట్కు వచ్చిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi), రాంచరణ్-ఉపాసన దంపతులు, అల్లు అర్జున్, వైష్ణవ్తేజ్తోపాటు ఇతర కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. ఈ ఈవెంట్ కోసం లావణ్య త్రిపాఠి స్టైలిష్ట్‌గా అశ్విన్ మావ్లే పనిచేస్తుండగా.. అనితా డోంగ్రే కాస్ట్యూమ్ డిజైనింగ్ పనులు చూస్తోంది. ఇక వరుణ్‌తేజ్‌కు తరుణ్ తహిలియాని డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు కొన్ని ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.
View this post on Instagram
Icon star @alluarjun at varun tej engagement function ❤️🔥pic.twitter.com/xRMSwqzJiq
— RoAAring_Icons (@RoAAring_Icons) June 9, 2023