Indra @ 20Years | మెగా బ్లాక్బాస్టర్ ‘ఇంద్ర’కు 2 దశాబ్దాలు..రికార్డుల మోత
ఆల్ టైమ్ ఫేవరేట్ హిట్‌గా నిలిచిన చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. అలాంటి తెలుగు చిత్రాల్లో టాప్ లో ఉంటుంది ఇంద్ర (Indra). చిరు కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇంద్ర నేటికి రెండు దశాబ్దాలు (#20Years Indra) పూర్తి చేసుకుంది.
లవ్, యాక్షన్, ఎమోషన్, సామాజిక ఇతివృత్తం, కామెడీ జోనర్లతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి..ఆల్ టైమ్ ఫేవరేట్ హిట్‌గా నిలిచిన చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. అలాంటి తెలుగు చిత్రాల్లో టాప్ లో ఉంటుంది ఇంద్ర (Indra) . మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు, మూవీ లవర్స్ కు ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. చిరు కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇంద్ర నేటికి రెండు దశాబ్దాలు (#20Years Indra) పూర్తి చేసుకుంది.
బి గోపాల్ (B Gopal) డైరెక్షన్లో రాయలసీమ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఇంద్ర సరిగ్గా ఇదే రోజు అంటే 2002 జులై 24న విడుదలైంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ (Vyjayanthi Movies)పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో రూ.10 కోట్ల (సుమారుగా)బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల పంట పండించింది. ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించగా..ముఖేశ్ రుషి, పునీత్ ఇస్సార్, ప్రకాశ్‌రాజ్, తణికెళ్లభరణి, శివాజీ, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాలో ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది..ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’ అంటూ చిరు చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ మార్మోగిపోతుంటాయి. ‘వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అని వచ్చే డైలాగ్ ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంకా ఎన్నో డైలాగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
మణిశర్మ కంపోజిషన్‌లో వచ్చిన పాటలన్నీ ఆల్‌టైమ్ బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమా మాకు చాలా ప్రత్యేకమైంది. మెగా బ్లాక్ బాస్టర్ 2 దశాబ్దాల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం..అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
A very special movie for us!
Celebrating 2 Decades of Mega Blockbuster #Indra.@KChiruTweets @AshwiniDuttCh #BGopal #ManiSharma @VyjayanthiFilms#20YearsForIndustryHitIndra pic.twitter.com/cInd3uq9la
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2022
Read Also :Aadi Sai Kumar | ట్విటర్‌లోకి స్వాగతం..యువ హీరో వీడియో ట్రెండింగ్
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Sai Pallavi Bonam | బోనమెత్తిన సాయిపల్లవి..ట్రెండింగ్‌లో డైరెక్టర్ స్పెషల్ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

