మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలగలిసిన కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషురెడ్డి ప్రధానపాత్రధారులు. సుకు పూర్వజ్ దర్శకుడు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీశ్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మాతలు. ైక్లెమాక్స్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్ వేల్యూస్‌తో ‘ఏ మాస్టర్ పీస్’ తెరకెక్కుతున్నదని, ఇదో అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన సూపర్‌హీరో సినిమా అని మేకర్స్ తెలిపారు. స్నేహా గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివరామ్ చరణ్, సంగీతం: అశీర్వాద్, సుమన్ జీవ రతన్, నిర్మాణం: సినిమా బండి, మెర్జ్ ఎక్స్ ఆర్.