Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి రాజాసాబ్ (Raja Saab) టైటిల్‌ను ఫైనల్ చేస్తూ ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. చాలా కాలం తర్వాత పాత లవ్లీ, మ్యాన్లీ యంగ్ రెబల్ స్టార్‌ను చూపించబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు మారుతి. తాజాగా ఈ మూవీ కథ ఇదేనంటూ ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ప్రేమలో పడ్డ ఓ జంట.. నెగెటివ్ ఎనర్జీ కారణంగా తమ గమ్యాన్ని మార్చుకునే నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ఐఎండీబీ (Internet Movie Database) రాసుకొచ్చింది. అయితే దీనిపై మారుతి ట్విట్టర్ ద్వారా స్పష్టత ఇచ్చాడు. ఐఎండీబీ పేజీలో ఇచ్చిన సమాచారం పూర్తిగా తప్పు.. తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రభాస్ అభిమానులు రాజాసాబ్ కొత్త అప్డేట్స్ ఏంటో చెప్పాలని వెంటపడటం ఖాయమైపోయినట్టే.
హార్రర్ కామెడీ జోనర్ సినిమాలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో మరో బ్యూటీ రిద్ది కుమార్ కీ రోల్ లో నటిస్తోంది. ప్రభాస్ నుదుటన బొట్టు, లాంగ్ హెయిర్, గడ్డంతో మ్యాన్లీ లుక్‌లో కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్తో క్లోజప్ యాంగిల్లో ఉన్న స్టిల్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించనున్నారు.
ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న మరో చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ తెరకెక్కిస్తున్నారు.
Probably the best #Sankranthi I’m having 🙂
It’s official now… presenting #TheRajaSaab to all of you 🤗🤗
Need all of ur blessings ♥️Chaala days nunchi, eppudu eppudu ani waiting. Finally it happened today. Darling ni ela chudali anukunnaro… ala choodabotunnaru… Promise !!… pic.twitter.com/02nkHBbpk3
— Director Maruthi (@DirectorMaruthi) January 15, 2024
ఎయిర్‌పోర్టులో మాళవికా మోహనన్..
.@MalavikaM_ spotted at the airport as she leaves for Hyderabad to join the next schedule of her Telugu film opposite #Prabhas!#MalavikaMohanan @proyuvraaj pic.twitter.com/lZDYXIpXPD
— meenakshisundaram (@meenakshinews) April 14, 2023