Manoj Bajpayee | కేఆర్కేపై క్రిమినల్ కేసు పెట్టండి..మనోజ్ బాజ్‌పేయి ఫిర్యాదు
వివాదాస్పద రివ్యూస్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు (Bollywood) బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (Kamal R Khan). ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రానికి ఇచ్చిన రివ్యూ కేఆర్కే ను చిక్కుల్లో పడేసింది.

వివాదాస్పద రివ్యూస్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు (Bollywood) బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (Kamal R Khan). ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రానికి ఇచ్చిన రివ్యూ కేఆర్కే ను చిక్కుల్లో పడేసింది. సల్మాన్ ఖాన్ ఈ విషయంలో కేఆర్కేను కోర్టుకు కూడా లాగాడు. ఇంత జరిగినా కేఆర్కే మాత్రం సినిమాల రివ్యూస్ కానీ, యాక్టర్లను విమర్శించే విషయంలో కానీ తన స్టైల్ మార్చుకోవడం లేదు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు, ది ఫ్యామిలీ మ్యాన్ ఫేం మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee) కేఆర్కేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాడు.
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జీఎంఎఫ్ సీ) కోర్టులో కేఆర్కేపై ఐపీసీ సెక్షన్ 500, 46 కింద కేసు నమోదు చేయాలని కోరాడు. జులై 26న కేఆర్కే తనపై ట్వీట్ చేసి..తన అభిమానులు, ఫాలోవర్లలో తనకున్న ప్రతిష్టను అవమానకరమైన రీతిలో దిగజార్జాడని మనోజ్ బాజ్ పేయి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టులో ప్రత్యేకంగా హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కేఆర్కేపై క్రిమినల్ పరువు నష్టం దావా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
కమల్ ఆర్ ఖాన్ తన రివ్యూస్, విమర్శలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. యాక్టర్లు, సినీ నిర్మాతలు విమర్శకులకు పూర్తిగా వ్యతిరేకం కాకపోయినప్పటికీ, కేఆర్కే నుండి అలాంటి విమర్శలను అంగీకరించే స్థితిలో లేరని ట్రేడ్ పండితుల అంచనా. మరి కమల్ ఆర్ ఖాన్ ఇప్పటికైనా తనపై వస్తున్న విమర్శలను గమనించి వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

