Elumalai | హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా డెబ్యూ ఇస్తోన్న చిత్రం ఏలుమలై (Elumalai). ప్రియాంక ఆచార్ హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. పునీత్ రంగస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి కాపాడు దేవా సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. పాపులర్ సింగర్ మంగ్లీ వాయిస్‌తో సాగుతున్న ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు.
డి ఇమ్మాన్ కంపోజిషన్‌లో మంగ్లీ పాడిన ఈ సాంగ్ హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్‌తో ఎమోషనల్‌గా సాగుతోంది. సినిమా ఎలా ఉండబోతుందనే థీమ్‌ను పాట ద్వారా హింట్ ఇచ్చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నరసింహ నాయక్ సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేషన్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Love… longing… and a tune that will stay with you forever ♾️
It’s here ♥️#KaapaaduDeva from #Elumalai out now https://t.co/bGlLBsAKSx ✨Singer: @iamMangli
Lyrics: Telugu – National Award Winner | #KarthikNetha@tharunsudhir @iamraanna @AtlantaNagendra #PunitRangaswamy… pic.twitter.com/k0vobzu4Dj— BA Raju’s Team (@baraju_SuperHit) August 9, 2025
Mega Actors | ఒకే చోట మెగా హీరోలు.. వైరలవుతున్న ఫొటో
Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ షురూ అయ్యేది అప్పుడేనట..!