Mangalavaram Movie | మంగళవారం నుంచి మత్తెక్కించే సెకండ్ సింగిల్ రిలీజ్.. RX100కు మించిన రొమాన్స్ ఉందిగా..!
Mangalavaram Movie | ఈ మధ్య కాలంలో ఒక్క టీజర్‌తో సినీ ప్రియులందరినీ తన వైపు తిప్పుకుంది మంగళవారం సినిమా. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. దానికి తోడు టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది.
Mangalavaram Movie | ఈ మధ్య కాలంలో ఒక్క టీజర్‌తో సినీ ప్రియులందరినీ తన వైపు తిప్పుకుంది మంగళవారం సినిమా. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. దానికి తోడు టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రంతో అల్ట్రా డిజాస్టర్ సాధించిన అజయ్ భూపతి ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స ఇప్పటినుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు.
తాజాగా ఈ సినిమాలోని ఏమయ్యిందో ఏమిటో అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో పాయల్ తన అందా చందాలతో యూత్‌ను కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా ఆర్ఎక్స్100లోని ఇందు పాత్రను గుర్తుచేసింది. ఆ సినిమాలోని పిల్లా రా పాటకు మించి రొమాన్స్ ఈ పాటలో కనిపించింది. కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ స్వర పరిచిన ఈ పాటను హర్షిక దేవనాథ్ ఆలపించగా చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించాడు. ఇప్పటికే రిలీజైన గణగణ మోగాలిరా పాటకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నందిత శ్వేత, రంగం ఫేమ్ అజ్మల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆర్ఎక్స్100తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి.. మహా సముద్రం వంటి తేలిపోయిన సినిమా చేయడం ఎవ్వరూ ఊహించలేరు. పైగా శర్వానంద్, సిద్దార్థ్ వంటి అద్భుతమైన కాస్ట్‌ను పెట్టుకుని ఆ రేంజ్ అవుట్ పుట్ ఇవ్వడం అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. అయితే ఆ సినిమా ప్రభావం మంగళవారంపై ఏ మాత్రం పడలేదు. పైగా ఇప్పుడంతా థ్రిల్లర్ సినిమాలదే హావా అవడంతో మంగళవారం సినిమాపై జనాల్లో తిరుగులేని అంచనాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

