మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ బుల్లితెరతో పాటు వెండితెరపై అలరించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె ఇటీవల వ్యక్తిగతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను షురూ చేసింది. ఆ యూట్యూబ్ ఛానెల్ లో పలు విషయాల గురించి ప్రస్తవిస్తూ వస్తుంది. ఆ మధ్య తన ఇంటి ని చూపించడం మొదలుకుని పలు విషయాలను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది.
మంచు లక్ష్మీ వీడియోకు లక్షలలో వ్యూస్ వస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడు స్పీడ్ పెంచింది. తాజాగా మేకప్ ఛాలెంజ్ పేరుతో ఒక వీడియోను షేర్ చేసింది. మేకప్ కోసం గంటలు గంటలు సమయం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని , తక్కువ సమయంలో అందంగా రెడీ కావచ్చని నిరూపించింది. మేకప్ ఛాలెంజ్ లో భాగంగా మంచు లక్ష్మి తాను మేకప్ అయ్యింది. కేవలం 12 నిమిషాల్లో తన మేకప్ ఆర్టిస్టు సాయంతో రెడీ అయ్యింది. తక్కువ సమయంలోనే మేకప్ అయ్యాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 12 నిమిషాలే నేను కేటాయించిన కూడా చాలా అందంగా వచ్చిందని తనకు తాను పొగిడేసుకుంది.