Home
Cinema
Mancherial Backdrop Love Story Makers Unveil First Glimpse Of Sumanth Prabhas Babloo Xxl
మంచిర్యాల నేపథ్య ప్రేమకథ
‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దర్శకుడు సాయిలు కంపాటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘బబ్లూ XXL’.
‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దర్శకుడు సాయిలు కంపాటి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘బబ్లూ XXL’. సుమంత్ ప్రభాస్, గహాజీ ఎస్కే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పుస్కూర్ రామ్మోహన్ రావు, భరత్ ఎన్ నారంగ్ నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో బబ్లూ ప్రేమకథ ఎలా మొదలయ్యిందో వినోదాత్మకంగా చూపించారు.
తొలిప్రేమ మధురానుభూతులకు అద్దం పడుతూ ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది. మంచిర్యాల నేపథ్యంలో తెరకెక్కుతున్న నవతరం ప్రేమకథా చిత్రమిదని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: సోనాలినారంగ్, రచన-దర్శకత్వం: సాయిలు కంపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

