శంకరవరప్రసాద్‌గారు పండక్కొస్తున్నారు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్ర నటుడు చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను శుక్రవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేశారు. ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘పండగకు వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్ర నటుడు చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను శుక్రవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేశారు. ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘పండగకు వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను ఓ ైస్టెలిష్ మాస్ ఎంటైర్టెనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారని శుక్రవారం విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ చెబుతున్నది. కారు వచ్చి ఆగింది.. డోర్ తీసి సిగరెట్ వెలిగిస్తూ, బ్లాక్ సూట్లో ఉన్న చిరంజీవి రివీల్ అయ్యారు. కారు దిగి కమాండోల మధ్య నడుస్తుండగా గ్లింప్స్ ప్రారంభమైంది. సిగరెట్ విసిరేస్తున్నప్పుడు టైటిల్ రివీల్ అయ్యింది. అగ్ర నటుడు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది. చిరంజీవి ఎవర్గ్రీన్ చరిష్మాను, ైస్టెల్‌ని అనిల్ రావిపూడి పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారనీ, గి ్లంప్స్ చివర్లో వచ్చే గుర్రం సీన్ ‘కొండవీటి దొంగ’ను గుర్తు చేసిందనీ అభిమానులు అంటున్నారు. గ్లింప్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చిరంజీవి ఇమేజ్‌ని గుర్తుచేస్తున్నది.
‘చిరంజీవి కంబ్యాక్ తర్వాత, ఆయన మెగా స్వాగ్‌ను మళ్లీ చూడాలనే ఒక కోరిక నాకెప్పట్నుంచో ఉండేది. ఫైనల్‌గా ఆయన్నలా చూపించే అవకాశం నాకే వచ్చింది. చిరంజీవిగారిని మనమంతా ఎలా చూడాలనుకుంటున్నామో అంతకు రెండింతలు రేపు సంక్రాంతికి చూస్తారు. చిరంజీవిగారి అసలు పేరైన శివశంకరవరప్రసాద్లో శంకరవరప్రసాద్ని తీసుకొని ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్ పెట్టాం. గ్లింప్స్‌కి వాయిస్ ఇచ్చిన విక్టరీ వెంకటేశ్‌గారికి థాంక్యూ. ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు. వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో, రేపు పండక్కి చూస్తారు. ఈ గ్లింప్స్ శాంపిలే.. సినిమాలో ఇంకా చాలా వున్నాయి.’ అని అనిల్ రావిపూడి చెప్పారు. ఇంకా నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో కూడా మాట్లాడారు. ఇదిలావుంటే… బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ని చిరంజీవికి అందించిన డైరెక్టర్ బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి మళ్లీ నటించనున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ని కూడా శుక్రవారం విడుదల చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

