Mana Doctor Baabe | ‘మన డాక్టర్ బాబే’ రివ్యూ: కామెడీ, ఎమోషన్ మేళవించిన ఫ్యామిలీ డ్రామా!
Mana Doctor Baabe | శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి నిర్మించి, రామకృష్ణ గరగ కథతో చలపతి కుమార్ పువ్వల దర్శకత్వం వహించిన ‘మన డాక్టర్ బాబే’ చిత్రం నవంబర్ 20, 2026న విడుదలైంది
సినిమా: మన డాక్టర్ బాబే
విడుదల తేదీ: నవంబర్ 20, 2026
నటీనటులు: శ్రీ స్కంద, మోహన సిద్ధి, శృతి శంకర్, రాజీవ్ కనకాల, అలీ, శాంతి, కోటేశ్వరరావు
దర్శకత్వం: చలపతి కుమార్ పువ్వల
కథ: రామకృష్ణ గరగ
నిర్మాణం: కృతాక్షి (స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై; శరణ్య, సుధీక్ష సమర్పణలో)
కథ
చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజు (శ్రీ స్కంద) పల్లెటూరి వాతావరణంలో పెరుగుతాడు. మేనమామ దుర్గారావు (రాజీవ్ కనకాల)కు రాజు అంటే అంతగా ఇష్టం ఉండదు. తన కూతురు సింధు (శృతి శంకర్)ను పెళ్లి చేసుకోవాలంటే ముందు డాక్టర్ కావాలని దుర్గారావు ఒక షరతు విధిస్తాడు. మరదలి కోసం శ్రమించి డాక్టర్‌గా ఎదిగిన రాజుకు, ఆ తర్వాత మరో ఊహించని మెలిక పడుతుంది. “డాక్టర్ అయ్యావు సరే కానీ, నువ్వు ఆండ్రాలజిస్ట్వి కాబట్టి నా కూతురిని ఇవ్వను; డాక్టర్ అనే పదానికి ముందున్న ఆ ట్యాగ్ తీసేస్తేనే పెళ్లి” అని దుర్గారావు తేల్చి చెబుతాడు. అయితే తన వృత్తి విషయంలో రాజు వెనక్కి తగ్గడు. అసలు రాజు ఆండ్రాలజిస్ట్గా ఎందుకు మారాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి? డాక్టర్ సుఖం (అలీ), గౌతమి (మోహన సిద్ధి), తాత రత్నం (కోటేశ్వరరావు) పాత్రల ప్రాధాన్యత ఏమిటి అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది.
విశ్లేషణ
పల్లెటూరి నేపథ్యం, మేనమామ–మరదలు–బావ అనుబంధాలు సినిమాకు సహజత్వాన్ని తీసుకువచ్చాయి. కుటుంబ బంధాల మధ్య ఉండే సంఘర్షణ, ప్రేమలో ఎదురయ్యే తడబాట్లు, భావోద్వేగాలను దర్శకుడు చలపతి కుమార్ పువ్వల సరళంగా తెరకెక్కించారు. ఆండ్రాలజిస్ట్ కాన్సెప్ట్‌తో ముడిపడిన అంశాలను ఎక్కడా అశ్లీలతకు లేదా హద్దులకు తావివ్వకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడని విధంగా రూపొందించడం ఈ చిత్రానికి సానుకూల అంశం. ప్రథమార్థం ఎక్కువగా ఆండ్రాలజిస్ట్ పాత్ర చుట్టూ అల్లుకున్న కామెడీ, రాజు–గౌతమి ట్రాక్, మరదలితో సాగే సన్నివేశాలతో సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు మేనమామ పెట్టే కండీషన్‌తో వచ్చే ట్విస్ట్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కామెడీతో పాటు ఎమోషనల్ డెప్త్ పెరుగుతుంది. బయటకు చెప్పుకోలేని ఇబ్బందులు, ఇద్దరి మధ్య చిక్కుకునే పరిస్థితులు కథను మలుపు తిప్పుతాయి. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపించినా, మొత్తం మీద ఒక తేలికపాటి వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా చూసిన అనుభూతిని ఇస్తుంది.
నటీనటుల ప్రతిభ
శ్రీ స్కంద తొలి సినిమాతోనే హీరోగా పరిచయమవుతున్నప్పటికీ, ఎక్కడా తడబాటు లేకుండా సహజంగా నటించాడు. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సన్నివేశాల్లో సమతూకం పాటించాడు. మోహన సిద్ధి & శృతి శంకర్ ఇద్దరూ తెరపై ఆకట్టుకునేలా కనిపించడమే కాకుండా, తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. రాజీవ్ కనకాల, కోటేశ్వరరావు, శాంతి అనుభవజ్ఞులైన నటీనటులుగా తమ పాత్రలకు బలాన్ని చేకూర్చారు. ముఖ్యంగా మేనమామ, తాత పాత్రలు కథకు అవసరమైన గంభీరతను, సహజత్వాన్ని అందించాయి. ద్వితీయార్థంలో డాక్టర్ సుఖం పాత్రలో అలీ కనిపించి తనదైన శైలి కామెడీతో నవ్వులు పంచాడు. మిగిలిన సహాయ నటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.
సాంకేతికంగా
కిషోర్ బోయిడపు సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను, సన్నివేశాల మూడ్‌ను చక్కగా బంధించింది. మనోజ్ కుమార్ అందించిన పాటలు, సన్నివేశాలకు తగ్గ నేపథ్య సంగీతం బాగున్నాయి. సెల్వ కుమార్ ఎడిటింగ్ కథనాన్ని క్రిస్ప్‌గా ఉంచడంలో సహాయపడింది. రామకృష్ణ గరగ కథలో వినోదంతో పాటు ఒక సందేశాన్ని మిళితం చేశారు. రాంబాబు గోశాల, గిరిధర్ రాగోలు, విష్ణు ఎర్రావుల, శర్వణై సిరి రాసిన పాటలు అర్థవంతంగా ఉండగా, సంభాషణలు సందర్భోచితంగా ఉన్నాయి. స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నమే అయినా నిర్మాణ విలువల విషయంలో రాజీ పడకుండా నిర్మించారు.
చివరిగా.. నవ్వులు, కుటుంబ అనుబంధాలు, హద్దులు దాటని వినోదంతో సాగే ‘మన డాక్టర్ బాబే’ సాధారణ ప్రేక్షకులను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తుంది.
రేటింగ్: 3
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

