మాయా తంత్రాలతో నిండిన భ్రమయుగం
వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఆయన మరో వైవిధ్యమైన సినిమా ‘భ్రమయుగం’.
వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఆయన మరో వైవిధ్యమైన సినిమా ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ జానర్‌ను నైట్ షిఫ్ట్ స్టూడియోస్ పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక ఇటీవల అబుదాబిలో నిర్వహించారు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో రూపొందిన ట్రైలర్ కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా కథ కేరళలో మాయాతంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య ఘటనల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మలయాళ వెర్షన్ గురువారం (రేపు) విడుదల కానుంది. త్వరలోనే మిగతా భాషల్లోనూ విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్ జలాల్, సంగీతం: క్రిస్టో జేవియర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

