Veera Dheera Sooran | తమిళ నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తంగలాన్ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లను ఒకే చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి ‘వీర ధీర శూరన్’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మిస్తుంది. విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే టైటిల్ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమాలో మలయాళ విలక్షణ నటుడు సిద్దికీ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఆయన పోస్టర్‌ను విడుదల చేసింది. విక్రమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధికీతో పాటు ఎస్.జె.సూర్య, దుశరా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.