Malavika Mohanan| మాస్క్ లేకుంటే నగ్నంగా ఉన్నట్టనిపిస్తుంది: మాళవిక మోహనన్
కరోనా విజృంభణతో దాదాపు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ (Covid Mask) పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవితంలో ఓ భాగమైపోయిన మాస్క్ లేకుంటే నగ్నంగా ఉన్నామనే భావన కలుగుతోందని చెప్తోంది మలయాళీ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan).

కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనాల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరోనా విజృంభణతో దాదాపు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ (Covid Mask) పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట్లో మాస్క్ అలవాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించినా..రాను రాను దాదాపు అందరూ విధిగా మాస్క్ పెట్టుకుంటున్నారు. గత ఏడాది కాలంగా జనాలు బయటకు వెళ్లారంటే మాస్క్ పెట్టుకునే వెళ్తున్నారు.
జీవితంలో ఓ భాగమైపోయిన మాస్క్ లేకుంటే నగ్నంగా ఉన్నామనే భావన కలుగుతోందని చెప్తోంది మలయాళీ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan). ప్రస్తుతం మారన్ సినిమా షూట్ లో భాగంగా హైదరాబాద్ లో ఉంది మాళవిక మోహనన్. ఈ భామ మీడియాతో చేసిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ..షూటింగ్ చేస్తున్నపుడు సెట్స్ లో కఠిన భద్రతా నియమాలు అమలు చేస్తున్నారు. కానీ యాక్టర్లుగా మేం మాస్క్ తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను చాలా కాలంగా మాస్క్ ధరించడం అలవాటు చేసుకున్నా. కానీ ఒక్కసారిగా మాస్క్ లేకుండా ఉండాల్సి వస్తే నగ్నంగా ఉన్న భావన కలుగుతోంది. మీ డ్రెస్సింగ్ లో ముఖ్యమైన వస్తువుగా మారిపోయిన మాస్క్ ను తీసేయాల్సి వస్తే కష్టంగా అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది.
త్వరలో తెలుగులో ఎంట్రీ ఇస్తానని చెప్పింది మాళవిక. విజయ్ దేవరకొండతో కలిసి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా ఆ సినిమా అటకెక్కింది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం మారన్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తుండగా..మాళవిక ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

