వ్యాపారితో లవ్ ట్రాక్!
మలైకా అరోరా.. ఈ పేరే సెన్సేషన్‌కు మారుపేరుగా నిలుస్తుంది! స్టన్నింగ్ లుక్స్, డ్రెస్సింగ్ స్టయిల్, రిలేషన్షిప్.. ఇలా ఆమె గురించిన ప్రతి వార్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయిపోతుంది. సినిమాలతో సంబంధం లేకుండా.. ఆమెపేరు నిత్యం వార్తల్లో నానుతూనే ఉంటుంది.
మలైకా అరోరా.. ఈ పేరే సెన్సేషన్‌కు మారుపేరుగా నిలుస్తుంది! స్టన్నింగ్ లుక్స్, డ్రెస్సింగ్ స్టయిల్, రిలేషన్షిప్.. ఇలా ఆమె గురించిన ప్రతి వార్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయిపోతుంది. సినిమాలతో సంబంధం లేకుండా.. ఆమెపేరు నిత్యం వార్తల్లో నానుతూనే ఉంటుంది. ఆమె గురించి నెట్టింట ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటుంది. ఇప్పటికే అర్బాజ్ ఖాన్‌తో విడాకులు, అర్జున్ కపూర్‌తో డేటింగ్ సాగించిన ఈ 52 ఏళ్ల బోల్డ్ బ్యూటీ.. తాజాగా, మరో యువ వ్యాపారితో ప్రేమలో పడ్డట్టు ఇంటర్నెట్ కోడై కూస్తున్నది. ముంబైకి చెందిన 32 ఏండ్ల వజ్రాల వ్యాపారి హర్ష్ మెహతాతో డేటింగ్ మొదలుపెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ కలిసి పలుమార్లు కెమెరా ఫ్లాష్‌లకు చిక్కడం.. పుకార్లకు ఆజ్యం పోస్తున్నది.
పలు ప్రత్యేక కార్యక్రమాలతోపాటు ఇటీవల ముంబై విమానాశ్రయంలోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు. దాంతో, తన పాటలు, డ్యాన్స్‌లతో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన ఈ వెటరన్ స్టార్ హీరోయిన్.. రెండో వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా చర్చ సాగుతున్నది. మోడల్, డ్యాన్సర్, యాంకర్‌గానూ బాలీవుడ్‌కు చిరపరిచితురాలైన మలైకా.. బాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకొని.. 2017లో విడిపోయింది. ఆ తర్వాత తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్లో పడిపోయింది. ఏడాది క్రితం ఇద్దరి మధ్యా గ్యాప్రాగా.. తాజాగా, మరో కుర్ర వ్యాపారితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రాజెక్టులేవీ లేకున్నా.. ఇలా నిత్యం వార్తల్లో మెదులుతూనే ఉన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

