Hari Hara Veeramallu | కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. వరస సినిమాలు కమిటైనా.. కొన్ని రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు ఈయన. చాలా రోజుల తర్వాత మళ్లీ ఫ్యూచర్ సినిమాలపై ఫోకస్ చేశాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్లో చాలా రోజుల తర్వాత జాయిన్ అయ్యాడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కెరీర్లో మొట్ట మొదటి పీరియాడికల్ సినిమా ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ఒక మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు.
కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హరిహర వీరమల్లు సినిమా కోసం కత్తిసాము, కర్రసాముతో పాటు మరికొన్ని పురాతన విద్యలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు పవన్. వీటికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. అవి చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదలైన వీడియో మరింత ఆసక్తికరంగా ఉంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఏఎం రత్నం హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ 60 శాతం పూర్తయింది. 2023 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు.
నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ ఇందులో విలన్‌గా నటిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు పవన్. హరిహర వీరమల్లు కోసం చాలా కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చాలా నేర్చుకుంటున్నాడు పవర్ స్టార్.