Sakshi Vaidya | ఆర్కిటెక్ట్ నిత్య పాత్రలో ఏజెంట్ భామ
ఏజెంట్, గాండీవధారి అర్జున చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది సాక్షి వైద్య. ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినా ఈ భామ అభినయానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సొగసరి తెలుగులో మరో మంచి ఆఫర్ను సొంతం చేసుకుంది.
Sakshi Vaidya | ఏజెంట్, గాండీవధారి అర్జున చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది సాక్షి వైద్య. ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను సాధించలేకపోయినా ఈ భామ అభినయానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సొగసరి తెలుగులో మరో మంచి ఆఫర్ను సొంతం చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరో శర్వానంద్. ప్రస్తుతం ఆయన తన 37వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. తాజాగా ఈ చిత్రంలో కథానాయికగా సాక్షి వైద్యను ఖరారు చేశారు. బుధవారం ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె ఆర్కిటెక్ట్ నిత్య పాత్రలో కనిపిస్తుందని, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతున్నామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, సహనిర్మాత: అజయ్ సుంకర, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

