హృతిక్, యష్ కాదట..
సూపర్ హీరో ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి రెండో భాగం రూపొందించేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో దేవ్ పాత్ర కీలకమైంది. ఈ క్యారెక్టర్‌ను మొదటి భాగంలో నాగార్జున పోషించారు.
సూపర్ హీరో ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి రెండో భాగం రూపొందించేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో దేవ్ పాత్ర కీలకమైంది. ఈ క్యారెక్టర్‌ను మొదటి భాగంలో నాగార్జున పోషించారు. ద్వితీయ భాగం సినిమాలో ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారనేది సందిగ్ధంలోనే ఉండిపోయింది. దేవ్ పాత్రకు ‘కేజీఎఫ్’ స్టార్ యష్‌ను తీసుకుంటున్నట్లు తాజాగా వార్తలొచ్చాయి. యష్‌కున్న ఇమేజ్‌కు దేవ్ పాత్ర బాగుంటుందనే విశ్లేషణలు వినిపించాయి. అయితే ఈ వదంతులపై స్పష్టత ఇచ్చారు నిర్మాత కరణ్ జోహార్. దేవ్ పాత్ర కోసం యష్‌ను తాము సంప్రదించలేదని కరణ్ వెల్లడించారు. అప్పటికే హృతిక్ రోషన్ పేరు కూడా ‘బ్రహ్మాస్త్ర 2’ కోసం వినిపిస్తున్నది. హృతిక్ మరికొద్ది రోజుల్లో తన ‘క్రిష్ 4’ సినిమా సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఇంతలో మరో సూపర్ హీరో చిత్రంలో నటించడం అతనికి ఇష్టం లేదట. ‘క్రిష్ 4’ దర్శకుడు రాకేష్ రోషన్ కూడా ఇందుకు సమ్మతించడం లేదు. దీంతో దేవ్ క్యారెక్టర్ కోసం ఓ బలమైన ఇమేజ్ ఉన్న నటుడిని వెతికే పనిలో పడ్డారు చిత్రబృందం. వీళ్ల అన్వేషణ రణ్‌వీర్‌సింగ్ దగ్గర ఆగేట్లు కనిపిస్తున్నది. ఇప్పుడున్న హీరోల్లో నెక్ట్స్ ఆప్షన్ అతనేనని అనుకుంటున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

