అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్స్‌లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రణబాలి, రౌడీ జనార్దన చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక మందన్న కథానాయిక. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ నెల 9న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌడీ జనార్దన’ విషయానికొస్తే.. ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం భారీ సెట్స్ వేస్తున్నారట.
ఈ సీక్వెన్స్‌లో విజయ్‌తో పాటు నలభైమంది ఫైటర్స్ కూడా భాగం కానున్నారని తెలిసింది. విజయ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తున్నది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నదని, ఆ ఎపిసోడ్లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్లో సినిమా విడుదల కానున్నట్టు వినికిడి.