టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ ఈసారి మాట తప్పనంటున్నాడు. అంతేకాదు డేట్ కూడా మారదంటున్నాడు. ఇంతకీ మ్యాటరేంటంటే ఈ హీరో నటిస్తోన్నమేజర్ సినిమా టీజర్ ఏప్రిల్ 12న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితంపై తెరకెక్కుతోంది మేజర్ సినిమా. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ఇంతకుముందు పలుసార్లు వాయిదాపడింది. అయితే ఈసారి ఖచ్చితంగా విడుదల చేస్తున్నామని, అభిమానులు రెడీగా ఉండమంటూ చిత్రయూనిట్ డేట్ అండ్ టైమ్ ని ప్రకటించింది. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈసినిమాని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.