కొన్నిసార్లు హఠాత్తుగా ఏ ఫంక్షన్‌కో బయల్దేరాల్సి వస్తుంది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లేంత సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు చిటికెలో ముఖాన్ని మెరిసేలా చేస్తుంది ‘కాఫీ-హనీ’ ఫేస్‌ప్యాక్. ఇది చర్మం మీది మృతకణాలను తొలగించి, తక్షణ మెరుపును ఇస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని.. రెంటినీ బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. కాఫీపొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు కళ్లచుట్టూ ఉన్న నల్లటి వలయాల్ని తగ్గిస్తాయి. చర్మం మీది దద్దుర్లు, మొటిమల మచ్చల్ని తక్కువ కనిపించేలా చేస్తాయి.