Sridevi Soda Centre | ‘శ్రీదేవి సోడా సెంటర్’ లో మహేష్ బాబుకు నచ్చిన సీన్లు ఇవే..!
సుధీర్ బాబు (Sudheer Babu)కు మేము ఏ విధంగా సహాయం చేయడం లేదు..ఇలా అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ వేడుకలకు, ఆడియో ఫంక్షన్లకు రావడం తప్పితే ఆయన సినిమాల విషయంలో తమ ప్రమేయం ఏ మాత్రం ఉండదు అంటూ ఇంతకు ముందే మహేష్ బాబు (Mahesh Babu)చెప్పాడు.

సుధీర్ బాబు (Sudheer Babu)కు మేము ఏ విధంగా సహాయం చేయడం లేదు..ఇలా అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ వేడుకలకు, ఆడియో ఫంక్షన్లకు రావడం తప్పితే ఆయన సినిమాల విషయంలో తమ ప్రమేయం ఏ మాత్రం ఉండదు అంటూ ఇంతకు ముందే మహేష్ బాబు (Mahesh Babu)చెప్పాడు. సొంతంగానే ఇండస్ట్రీకి వచ్చి ఎదుగుతున్నాడు సుధీర్ బాబు అంటూ ఆయనపై ఎప్పటి నుంచో ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు సూపర్ స్టార్. ఇక తాజాగా ఆయన నటించిన శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Centre) సినిమాపై పొగడ్తల వర్షం కురిపించాడు మహేష్. ఆగస్ట్ 27న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో బాగానే రన్ అవుతుంది. రిలీజ్ రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా షో వేసుకొని చూశారు.
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు. సుధీర్ బాబు అద్భుతంగా నటించారని.. ఆయన కెరీర్ లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అంటూ మహేష్ మన్ననలు అందించారు. ఆడవాళ్లంతా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అటు మహేష్ బాబు తెలిపారు. సినిమాలో మహిళా ప్రాధాన్యత సన్నివేశాలు చాలా ఉన్నాయి అంటూ ప్రశంసించారు మహేష్ బాబు. మరీ ముఖ్యంగా సినిమాలో బోట్ సన్నివేశాల గురించి మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రేసింగ్ సీన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. దాంతో పాటు జైలులో వచ్చే స్యాడ్ సాంగ్ లో ఫైట్ పెట్టడం అద్భుతమైన ఆలోచన అన్నారు మహేష్.
ఇలాంటి సన్నివేశాలు సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని..ప్రతి ఒక్కరు ఈ సినిమా తప్పకుండా చూడాలని తెలిపారు మహేష్ బాబు. తాజాగా హీరో సుధీర్ బాబు, నిర్మాతలు, దర్శకుడు ప్రత్యేకంగా వెళ్లి మహేష్ బాబును కలిశారు. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా..వ్యక్తిగతంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా యూనిట్ ను కలిసి తన అభినందనలు అందించారు మహేష్ బాబు. ఇలాంటి అద్భుతమైన సినిమాలు సుధీర్ బాబు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు. అలాగే చిత్రయూనిట్ ను కూడా ప్రత్యేకంగా అభినందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన ప్రశంసలతో శ్రీదేవి సోడా సెంటర్ చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయారు. మహేష్ బాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

