‘బాహుబలి’ లాంటి ప్రయత్నం?
సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి మరో కొత్త విషయం బయటకొచ్చింది.
సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి మరో కొత్త విషయం బయటకొచ్చింది. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంగా సాగే అడ్వెంచర్ జర్నీగా ఉంటుందని ఇప్పటికే తెలియగా…తాజాగా ఈ ప్రాజెక్ట్ ఫ్రాంఛైజీగా ఉండబోతున్నట్లు వెల్లడైంది. ఈ చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ…‘మహేష్, రాజమౌళి సినిమాను రెండు మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నాం. ఈ ఫ్రాంఛైజీలో కథలు మారుతుంటాయి. అయితే ప్రధాన పాత్రలన్నీ కొనసాగుతాయి’ అని చెప్పారు. విజయేంద్రప్రసాద్ మాటలను బట్టి ‘బాహుబలి’లా ఇదొక భారీ ప్రాజెక్ట్ కానుందని తెలుస్తున్నది. మహేష్ బాబు నటిస్తున్న 29వ చిత్రమిది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

