Maharaj | ఓటీటీలోకి వచ్చేసిన అమీర్ ఖాన్ కొడుకు వివాదాస్పద చిత్రం ‘మహారాజ్’
Maharaj Movie |బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మహారాజ్. ఈ సినిమాకు సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా.. బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అయితే జునైద్ ఖాన్ తొలి చిత్రం 'మహారాజ్' విడుదలకు ముందే చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే.
Maharaj Movie |బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మహారాజ్. ఈ సినిమాకు సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా.. బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అయితే జునైద్ ఖాన్ తొలి చిత్రం ‘మహారాజ్’ విడుదలకు ముందే చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే.
జూన్ 14న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ హిందు సంఘాలు కోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకున్న గుజరాత్ హైకోర్ట్ ఈ చిత్ర నిర్మాణ సంస్థకు షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా ‘మహారాజ్’ సినిమాను విడుదల చేయవచ్చని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ మూవీ ట్రైలర్‌తో పాటు మూవీని నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల చేశారు మేకర్స్.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన న్యాయ పోరాటాలలో ఒకటిగా పరిగణించబడే 1862 మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1862లో మతాన్ని అడ్డుపెట్టుకుని స్వామీజీలు ఎలాంటి క్రూరమైన పనులు చేశారు. భక్తి ముసుగులో అమ్మాయిలను బలత్కారం చేయడం లాంటి ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఇందులో జునైద్ ఖాన్ సంఘ సంస్కర్త కర్సందాస్ ముల్జీ పాత్రను పోషిస్తుండగా.. స్వామీజీ పాత్రలో జైదీప్ అహ్లావత్ నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

