Sanoj Mishra | అత్యాచారం ఆరోపణలు.. మోనాలిసా డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్
Sanoj Mishra | ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా ద్వారా ఫేమస్ అయిన పూసలమ్ముకునే అమ్మాయి (Maha Kumbh Girl) మోనాలిసా (Monalisa)కు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) అరెస్ట్ అయ్యారు.
Sanoj Mishra | ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా ద్వారా ఫేమస్ అయిన పూసలమ్ముకునే అమ్మాయి (Maha Kumbh Girl) మోనాలిసా (Monalisa)కు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) అరెస్ట్ అయ్యారు. తనను లైంగికంగా వేధించాడని, వీడియోలు తీసి బెదిరించాడంటూ ఓ యువతి ఫిర్యాదు మేరకు డైరెక్టర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. తనకు సినిమాలో నటించే అవకాశం ఇస్తానని నమ్మించి తప్పుడు హామీలతో ప్రలోభపెట్టి పదేపదే అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. 2020లో డైరెక్టర్‌తో ఇన్‌స్టా, టిక్‌టాక్ ద్వారా తనకు పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. ఆ తర్వాత ఇద్దరం తరచుగా మాట్లాడుకునే వాళ్లమని.. అలా జూన్ 17, 2021లో తాను ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నానని మిశ్రా తనకు ఫోన్ చేసినట్లు చెప్పింది. అయితే, ఆయన్ని కలిసేందుకు తాను నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని ఆరోపించింది. అతడి బెదిరింపులకు భయపడిపోయిన తాను తర్వాతి రోజు కలిసేందుకు ఒప్పుకున్నట్లు చెప్పింది. జూన్ 18, 2021న తనని ఓ రిసార్ట్‌కు తీసుకెళ్లి, అక్కడ మత్తుమందు ఇచ్చి తనపై దాడి చేసినట్లు ఆరోపించింది. ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్లు చెప్పింది. ఆ వీడియోలతో తనను బెదిరించి అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సనోజ్ మిశ్రాను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
తొలి చిత్రానికి సంతకం చేసిన మోనాలిసా
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి వైరల్ అయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. అయితే తన వ్యాపారం బాగా జరుగుతుందనుకుంటే ఒక నెటిజన్ ఆమె ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో రాత్రికి రాత్రే వైరల్‌గా మారింది మోనాలిసా. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో కుంభమేళాకి వెళ్లిన వారు ఆమెతో ఫొటో దిగడానికి ఆసక్తిచూపించడం.. ఫొటోల పేరుతో ఆమెను ఎక్కడపడితే అక్కడ తాకడం వివాదానికి దారి తీసింది. దీంతో తన పూసల బిజినెస్ వదిలేసి తన గ్రామంకి వెళ్లిపోయింది.
మోనాలిసా పరిస్థితి తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఫొటోలు చూసి హీరోయిన్గా అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మణిపూర్ నేపథ్యంలో రాబోతున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ (The Diary of Manipur) మూవీకి సంతకం కూడా చేసింది మోనాలిసా. ఈ సినిమా కోసమే ప్రస్తుతం యాక్టింగ్‌పై ట్రెయినింగ్ కూడా తీసుకుంటోంది. ఇక మోనాలిసాకి సంబంధించిన అన్ని పనులను సనోజ్ మిశ్రానే దగ్గరుండి చూసుకుంటున్నాడు.
దీంతో సనోజ్ మిశ్రా .. మోనాలిసాతో క్లోజ్‌గా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. సనోజ్ మిశ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనోజ్ మోనాలిసాను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని, ఆమెను ట్రాప్ చేస్తున్నారని, తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై సనోజ్ మిశ్రా స్పందించారు. మోనాలిసా నా కూతురు లాంటిదని తెలిపాడు. ఆమె నా కూతురు వయసు ఉంటుంది. నేను ఆమెను వేధించట్లేదు. ఆమె ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తుంది. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమెను నేనే యాక్టింగ్ నేర్పిస్తున్నాను. ఇది తప్పుదోవ పట్టించడం కాదు. తనకి యాక్టింగ్ వచ్చింది అన్నప్పుడు సినిమా స్టార్ట్ చేస్తానని తెలిపాడు.
Also Read..
Ayodhya Ram temple | నవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామాలయం
Klinkaara | క్లింకార ఉగాది సెలబ్రేషన్స్.. ఎంత చక్కగా పూజ చేస్తుంది..!
Betting | ఈ ఆటకు అంతం లేదా?.. బెట్టింగ్ యాప్‌ల వ్యసనంపై అల్లాణి శ్రీధర్ సినిమా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

